ఇంటర్ పరీక్షల షెడ్యూలును తెలంగాణ ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. ఏప్రిల్ 20 వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 23 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించేలా షెడ్యూలు తయారు చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఇంటర్మీడియేట్ అకాడమిక్ క్యాలెండర్ లో పలు మార్పులు చేసింది.
గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్, మార్చిలో థియరీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కానీ.. ఇప్పటికీ సిలబస్ పూర్తి కాకపోవడం, థర్డ్ వేవ్ కరోనా ఎఫెక్ట్ తో విద్యాసంస్థలకు జనవరిలో సెలవులు ఇవ్వటంతో పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కొత్త షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 23 నుంచి ప్రాక్టికల్స్ మొదలవుతాయి.
ఈసారి పరీక్షలకు పేపర్ మోడల్ కూడా మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని సబ్జెక్టుల్లో ఛాయిస్ ప్రశ్నలు ఎక్కువగా ఉండేలా పేపర్లు తయారు చేయనున్నారు. మార్పులకు అనుగుణంగా కొత్త మోడల్ పేపర్లను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.
ఏప్రిల్ 20 నుండి మే 5 వరకు పరీక్షలు
ఏప్రిల్ 20 నుంండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
ఏప్రిల్ 21న ఇంటర్ నుండి రెండో సంవత్సర పరీక్షలు
ఏప్రిల్ 20న తెలుగు మొదటి సంవత్సరం పరీక్ష
ఏప్రిల్ 22 మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష
ఏప్రిల్ 25 మొదటి సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు
ఏప్రిల్ 27.. మొదటి సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష
ఏప్రిల్ 29 మొదటి సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ , పరీక్ష
మే 2 మొదటి సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు
ఏప్రిల్ 21న
రెండో సంవత్సరం తెలుగు పరీక్ష
ఏప్రిల్ 23 రెండవసంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష
ఏప్రిల్ 26 రెండవ సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు
ఏప్రిల్ 28. రెండవ సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష
ఏప్రిల్ 30 రెండవ సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ , పరీక్ష
మే 5 రెండవ సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు