తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ (Telangana Job Notification) కు రంగం సిద్ధమైంది. దాదాపు 4 వేలకు పైగా నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. వారంలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 4,722 నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు సన్నహాలు జరుగుతుండగా.. ఇందులో అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3823, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలో 757, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 81, ఆయుష్ విభాగంలో మరో 61 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే.. ఈ నియామకాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న నర్సులకు వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. గతంలో ప్రభుత్వం సైతం ఈ మేరకు వారికి హామీ ఇచ్చింది. అయితే.. పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూ(JNTU)కు అప్పగించే అవకాశాలు సైతం ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే 4,722 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొత్తం నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా రెండు నెలల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
గత నోటిఫికేషన్ గందరగోళం:
వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్ విధానంలో నర్సుల భర్తీకి ఆఖరిగా 2017లో టీఎస్‌పీఎస్సీ (TSPSC) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పటి నుంచి నర్సు ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. అయితే.. ఆ నోటిఫికేషన్లో పలు లోపాలు ఉండడంతో పలువురు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. ఆ సమస్యలు పరిష్కారం కావడానికి 2021 వరక పట్టింది. దీంతో 2021లో తుది జాబితా విడుదల చేసి నర్సులకు పోస్టింగ్‌లు ఇచ్చారు అధికారులు. అయితే.. ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేదుకు మెడికల్ బోర్డు ద్వారానే నర్సు పోస్టుల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
READ THIS: టీఎస్పీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్లు.. మొత్తం 11,332 ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే..
తీవ్ర పోటీ ఉండే అవకాశం:
అయితే.. ఈ సారి నర్సు ఉద్యోగాలకు తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నర్సింగ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 60వేలమంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 25 శాతం మందికి పైగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నారు. మిగతా వారంతా కొందరు ఖాళీగా ఉండగా.. మరికొందరు కోర్సుతో సంబంధం లేని జాబ్స్ చేస్తున్నారు. దీంతో వీరంతా ఈ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారికి వెయిటేజీని ప్రభుత్వం ప్రకటించడంతో వారందరికీ సులువుగా ఉద్యోగం దక్కే అవకాశం ఉంది.
Unna variki jeethalu 10 aitunnadi ….medical bills …chanipayaka kuda ravatam ledu…prc 18 emi lu ista ani eppatidaka gathi ledu….DA lu anni bakee …kotta ujjyogalu ecchi