ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎస్ఐ జాబ్స్ 411 కాగా.. కానిస్టేబుల్ ఉద్యోగాలు 6100 ఉన్నాయి. ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు అంటే.. డిసెంబర్ 14న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 18, 2023ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే నవంబర్ 30న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 28 ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష: ఎస్ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 19, 2023న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 22, 2023న ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది.
ఖాళీల వివరాలు:
ఎస్ఐ జాబ్స్
ఎస్ఐ(సివిల్)-315
రిజర్వ్ ఎస్ఐ(APSP)-96
మొత్తం-411
కానిస్టేబుల్ జాబ్స్:
కానిస్టేబుల్ (సివిల్)-3580
కానిస్టేబుల్ (APSP)-2520
మొత్తం: 6100