తెలంగాణలో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా టీఎస్పీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఖాళీల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అర్హతల డిటైల్స్ ఇలా ఉన్నాయి.
పాలిటెక్నిక్ లెక్చరర్స్ (LECTURERS IN GOVERNMENT POLYTECHNICS):
247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి.. అంటే డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 4ను ఆఖరితేదీగా నిర్ణయించారు. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ లింక్-LINK
డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (TSPSC Drugs Inspector Notification):
18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5 ఆఖరి తేదీ. డిగ్రీలో ఫార్మసీ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. డీ. ఫార్మా లేదా క్లినికల్ ఫార్మకాలజీ స్పెషలైజేషన్ లో మెడిసిన్ లేదా మైక్రోబయాలజీలో డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
నోటిఫికేషన్ లింక్-LINK
జూనియర్ లెక్చరర్ (TSPSC Junior Lecturers Notification):
1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇటీవల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఈ నెల 16 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 27 సబ్జెక్టులకు సంబంధించి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2023 జూన్/జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్షను నిర్వహించనున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
నోటిఫికేషన్ లింక్: Link