తెలంగాణ ప్రభుత్వం 80 వేల పోస్టుల భర్తీలో భాగంలో తొలివిడతలో 30453 పోస్టుల నియామకాలకు అమోదం తెలిపింది. వీటిని ఆయా విభాగాలకు పంపించింది. దీంతో టీఎస్పీఎస్సీ, టీఎస్ఎల్పీఆర్బీ చేపట్టాల్సిన నియామకాలకు లైన్ క్లియరైంది. రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు తేలగానే మొదల గ్రూప్ 1, పోలీస్ రిక్రూట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.