SSC CHSL (10+2) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ 2020
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో 6000 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎల్‍డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) వంటి పోస్టుల భర్తీకి ఏటా నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) ఎగ్జామినేషన్ వెలువడింది. ఇంటర్ పాసైన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులే. గతేడాది 4,893 పోస్టులను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేసింది. ఈ ఏడాది దాదాపు 6000 పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. సీజీఎల్ తర్వాత ఎక్కువ మంది రాసే పరీక్ష సీహెచ్‍ఎస్‍ఎల్. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పోటీ పడతారు. సిలబస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్లాన్డ్‌గా ప్రిపేరయితే ఇంటర్‌తోనే సెంట్రల్ జాబ్ కొట్టొచ్చు.
నోటిఫికేషన్
అర్హత: ఎల్‌డీసీ, జేఎస్ఏ, పీఏ/ఎస్ఏ, డీఈవో పోస్టులకు ఏదైనా గ్రూప్‌తో ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి.
ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్/మహిళలకు ఫీజు లేదు.
అప్లికేషన్ చివరితేది: 2020 డిసెంబర్ 15
ఫీజు చెల్లింపు: 2020 డిసెంబర్ 17
పరీక్ష తేది: 2021 ఏప్రిల్ 12 నుంచి 27 వరకు
వెబ్‌సైట్: www.ssc.nic.in
టైర్-1 ఎగ్జామ్ 2021 ఏప్రిల్ 12 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
టైర్-2 పరీక్ష టైం టేబుల్ వెలువడాల్సి ఉంది.
సెలెక్షన్ ప్రాసెస్
టైర్-I, II, III అనే మూడు దశల్లో నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొదటిదశలో మల్టిపుల్ చాయిస్ విధానంలో 200 మార్కులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. డ్యురేషన్ 60 నిమిషాలు. రాంగ్ ఆన్సర్‌కి 0.50 మార్కు నెగెటివ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీలో ముద్రిస్తారు.
టైర్- I లో మెరిట్ సాధించిన వారిని టైర్-II లో నిర్వహించే డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు సెలెక్ట్ చేస్తారు. ఇందులో కూడా ఎంపికైతే స్కిల్‍టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు రాయాల్సి ఉంటుంది.
టెస్ట్ ప్యాటర్న్
___________
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50
జనరల్ ఇంటెలిజెన్స్ 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50
జనరల్ అవేర్‌నెస్ 50
మొత్తం 200