Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSడిగ్రీతో పీఎఫ్​ ఆఫీసుల్లో 2674 పోస్టులు.. ఎల్లుండి నుంచే అప్లికేషన్లు ​

డిగ్రీతో పీఎఫ్​ ఆఫీసుల్లో 2674 పోస్టులు.. ఎల్లుండి నుంచే అప్లికేషన్లు ​

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో రిక్రూట్​మెంట్​ (Employees’ Provident Fund Organisation Recruitment) నోటిఫికేషన్​ వెలువడింది. దేశ వ్యాప్తంగా రెగ్యులర్‌ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో రీజియన్ల వారీగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. మొత్తం 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

Advertisement

పోస్టులు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఎస్‌ఎస్‌ఏ- గ్రూప్ సి)

ఖాళీలు: మొత్తం 2674 పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్​ వెలువడింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో 39, తెలంగాణ రీజియన్‌లో 116 ఖాళీలు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు 514, ఈడబ్ల్యూఎస్‌లకు 529, అన్‌ రిజర్వ్‌డ్‌కు 999 పోస్టులను కేటాయించారు.

అర్హత: డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హలవుతారు. నిమిషానికి 35 ఇంగ్లిష్‌ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్‌లో టైపింగ్ చేయగల నైపుణ్యం ఉండాలి.

Advertisement

వయస్సు: అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు, ఓబీసీలకు, ఫిజికల్లీ ఛాలెంజింగ్​, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు వయో పరిమితి సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.29,200 – రూ.92,300 వరకు జీతభత్యాలు ఉంటాయి.

రిటెన్​ టెస్ట్: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ టైప్​ ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ (30 ప్రశ్నలు), జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌ (30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ (30 ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌ (50 ప్రశ్నలు), కంప్యూటర్‌ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.

Advertisement

అప్లికేషన్​ ఫీజు: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

అప్లికేషన్లు: మార్చి 27 నుంచి అప్లికేషన్లు మొదలవుతాయి. అభ్యర్థులు ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. ఏప్రిల్ 26వ తేదీ అప్లికేషన్లకు తుది గడువు. 27, 28వ తేదీలలో అప్లికేషన్లను ఎడిట్​ చేసుకునే ఛాన్స్​ ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!