HomeNCERT SOLUTIONS10th CLASSపదో తరగతి హాల్ టికెట్లు.. మోడల్​ పేపర్లు 2023

పదో తరగతి హాల్ టికెట్లు.. మోడల్​ పేపర్లు 2023

తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు హాల్​ టికెట్లతో పాటు మోడల్​ పేపర్లను ఎస్​ఎస్​సీ బోర్డు రిలీజ్​ చేసింది. తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి ( TS Tenth Class Exams) పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. టెన్త్ పరీక్షల హాల్ టికెట్లను ఎస్​ఎస్​సీ బోర్డు (TELANGANA BOARD OF SECONDARY EDUCATION) శుక్రవారమే విడుదల చేసింది. హాల్​ టికెట్లను ఎస్ ఎస్​సీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్ సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ జిల్లా, పాఠశాల పేరు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.

Advertisement

హాల్​ టికెట్లు డౌన్​ లోడ్​ చేసుకోవాల్సిన డైరెక్ట్ లింక్​ www.bse.telangana.gov.in

ఈ హాల్ టికెట్లపై హెడ్​ మాస్టర్​ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తామని ఎస్​ఎస్​సీ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక రోజు ముందే తమ పరీక్షా కేంద్రానికి వెళ్లి అడ్రస్ సరి చూసుకోవాలని సూచించింది. విద్యార్థులు తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 9030282993 కు ఫోన్ చేయాలని కోరింది. 

పరీక్షల టైంటేబుల్

ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్​ 4 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 ఇంగ్లిష్,
ఏప్రిల్ 8మ్యాథ్స్
ఏప్రిల్ 10సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 11సోషల్ స్టడీస్
ఏప్రిల్ 12ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు,
ఏప్రిల్ 13 ఓరియంటెల్ పేపర్-2

ఏడాది ఏప్రిల్ 3న పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే సైన్స్‌ పరీక్షను మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ సారి పదో తరగతి పరీక్షల్లో అబ్జక్టివ్​ పేపర్​ (మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నాపత్రం) రాసేందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. గతంలో ఈ పేపర్‌కు 30 నిమిషాల సమయం ఉండేది.

Advertisement

మోడల్​ పేపర్లు 2023

ఈ ఏడాది (2023) సిలబస్​, ప్రశ్నాపత్రం మోడల్​కు అనుగుణంగా తెలంగాణ ఎస్ఎస్​సీ బోర్డు మోడల్​ పేపర్లను విడుదల చేసింది. విద్యార్థుల ప్రాక్టీస్​కు వీలుగా ఉండేలా సబ్జెక్ట్ ల వారీగా ఈ మోడల్​ పేపర్లను ఇక్కడ అందిస్తున్నాం. పీడీఎఫ్​ రూపంలో ఉన్న ఈ మోడల్​ పేపర్లను విద్యార్థులు ఉచితంగా డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు.

>> ఇంగ్లిష్​ (ENGLISH)

>> తెలుగు (TELUGU)

Advertisement

>> హిందీ (HINDI)

>> భౌతిక శాస్త్రం (PHYSICAL SCIENCE)

>> జీవ శాస్త్రం (BIOLOGICAL SCIENCE)

Advertisement

>> గణితం (MATHS)

>> సాంఘిక శాస్త్రం (SOCIAL STUDIES)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!