HomeLATESTరైల్వేలో కొలువుల జాతర.. మొత్తం 2 లక్షల జాబ్స్.. నోటిఫికేషన్లు ఎప్పుడో తెలుసా?

రైల్వేలో కొలువుల జాతర.. మొత్తం 2 లక్షల జాబ్స్.. నోటిఫికేషన్లు ఎప్పుడో తెలుసా?

ఇటీవల కేంద్ర మంత్రి రైల్వేలో దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు (Railway Jobs) ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏప్రిల్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం ఖాళీల్లో గ్రూప్-డీ (Railway Group-D Jobs) ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

ఈ మొత్తం ఖాళీల్లో దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 10వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిలో గ్రూప్ డీ పోస్టులే అధికంగా ఉన్నాయి. ఈ పోస్టులతో పాటు.. జూనియర్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ , నాన్ టెక్నికల్, అసిస్టెంట్ లోకోపైలెట్ వంటి పోస్టులు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం కొనసాగుతోన్న గ్రూప్ డీ 2019 నియామక ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!