తెలంగాణ పోలీస్ జాబ్స్ అప్లికేషన్ల గడువు ముగిసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు వివిధ కేటగిరీల కు తెలంగాణ పోలీసు నియామక బోర్డు ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులే తదుపరి ఈవెంట్స్‌కు, మెయిన్ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు. అందుకే ప్రిలిమ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ పక్కాగా చాప్టర్ వైజ్ సిలబస్‌ను.. ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని మార్కులు వస్తాయనే వెయిటేజీ ప్రకారం స్టడీ ప్లాన్ చేసుకోవాలి. ఈసారి ప్రిలిమ్స్‌లో 30 శాతం అంటే 60 మార్కులు సాధించిన అభ్యర్థులు మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. కానీ.. నెగెటివ్ మార్కులు ఉన్నాయనేది అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ప్రిలిమ్స్‌లో అయిదు తప్పుడు సమాధానాలు బబుల్ చేస్తే.. మీకు వచ్చిన వాటిలో ఒక మార్కు కట్ అవుతుంది. అందుకే ఏదో ఒకటి తోచిన ఆన్సర్ కాకుండా.. కరెక్ట్ గా ఆన్సర్ తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధపడాలి. దీంతో నెగెటివ్ మార్కుల ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతారు. అందుకు వీలుగా ప్రిపరేషన్ నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తోచిందల్లా చదవకుండా సిలబస్ లోని ఏయే సబ్జెక్టు నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో ముందుగా అవగాహన పెంచుకోవాలి. అందుకే అభ్యర్థులకు ఉపయోగపడేలా.. 2016, 2018లో టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్‌ను పరిశీలించి.. ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనే వెయిటేజీని ఇక్కడ అందిస్తున్నాం. దీని అధారంగా ప్రిపేరయితే తప్పకుండా మంచి స్కోర్ సాధించగలుగుతారు.
ఎస్ఐ ప్రిలిమ్స్ మార్కుల వెయిటేజీ
సబ్జెక్టు | ప్రశ్నలు |
అర్థమెటిక్ | 50 |
రీజనింగ్ | 40 |
ప్యూర్ మ్యాథ్స్ | 10 |
జనరల్ సైన్స్ | 15 |
కరెంట్ అఫైర్స్ | 15 |
ప్రిన్సిపుల్స్ జాగ్రఫీ | 17 |
పాలిటీ, ఎకానమీ | 15 |
ఇండియన్ హిస్టరీ | 15 |
తెలంగాణ ఉద్యమం, చరిత్ర | 23 |
మొత్తం ప్రశ్నలు | 200 |
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మార్కుల వెయిటేజీ
సబ్జెక్టు | ప్రశ్నలు |
అర్థమెటిక్ | 25 |
రీజనింగ్ | 25 |
జనరల్ ఇంగ్లిష్ | 20 |
జనరల్ సైన్స్ | 25 |
కరెంట్ అఫైర్స్ | 22 |
ప్రిన్సిపుల్స్ జాగ్రఫీ | 14 |
పాలిటీ, ఎకానమీ | 19 |
ఇండియన్ హిస్టరీ | 20 |
తెలంగాణ ఉద్యమం | 20 |
తెలంగాణ చరిత్ర | 10 |
మొత్తం ప్రశ్నలు | 200 |