ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ వారం రోజుల్లో విడుదల కానుంది. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. కటాఫ్ మార్కులు, అందుకు సంబంధించిన కోర్టు కేసుల అడ్డంకులన్నీ తొలిగిపోవటంతో.. ఈ వారంలోనే ఫలితాలు వెల్లడించే అవకాశముందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 1న ఎస్ఐ, ఆగస్టు 28న కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. 554 ఎస్ఐ పోస్టులకు 2,41, 217 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. 16,821 కానిస్టేబుల్ పోస్టులకు 600855 మంది పోటీ పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ మిలిటరీ అభ్యర్థుల కటాఫ్ మార్కుల విషయంలో ఆందోళనలు తలెత్తాయి. దీంతో ఫలితాల ప్రక్రియ వాయిదా పడింది.
అభ్యర్థుల విజ్ఞప్తులకు స్పందించిన సీఎం కేసీఆర్ కటాఫ్ మార్కులను తగ్గిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కటాఫ్ మార్కులపై జీవో జారీ చేసింది. బీసీలకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక అభ్యర్థులకు 40 మార్కులుగా నిర్ణయించింది. ఓసీ అభ్యర్థుల కటాఫ్ (60 మార్కులు)లో ఎలాంటి మార్పు లేదు. ఈ జీవోకు అనుగుణంగా కటాఫ్ మార్కులను సవరించి.. ప్రిలిమ్స్ రిజల్ట్ విడుదల చేసేందుకు బోర్డు తుది కసరత్తు చేస్తోంది. కటాఫ్ మార్కులకు సంబంధించిన కోర్టులో ఉన్న కేసు కూడా క్లోజయింది. దీంతో వారం రోజుల్లో రిజల్ట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. పరీక్ష నిర్వహించి దాదాపు రెండు నెలలు కావస్తుండటంతో దాదాపు ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రిలిమ్స్ ఫలితాల అనంతరం నవంబర్‌లో ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్టులతో పాటు, ఈవెంట్స్ నిర్వహించనున్నారు. రిజల్ట్స్‌తో పాటే ఈవెంట్స్ తేదీల వివరాలను వెల్లడిస్తారు.
Constable
Constable
Ts conistebul
Marapelli Vinay result.com
Marapelli Vinay
Marapelli Vinay Vinay marapelli @gmail. Comhttptslprb.20result202022
Save my name email and website in this browser for the next time l comment
At ts constebul