HomeLATESTప్లానింగ్​ అండ్​ అర్కిటెక్చర్​లో కోర్సులు

ప్లానింగ్​ అండ్​ అర్కిటెక్చర్​లో కోర్సులు

ప్లానింగ్​ అండ్​ అర్కిటెక్చర్​ కోర్సుల్లో యూజీ, పీజీ, పీహెచ్​డీ ప్రోగ్రాముల్లో అడ్మిషన్లకు న్యూ ఢిల్లీలోని స్కూల్​ ఆఫ్​ ప్లానింగ్ అండ్​ అర్కిటెక్చర్ (SPA) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నేషనల్​ లెవెల్​ ఎగ్జామ్​లో మెరిట్​, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.

Advertisement

యూజీ ప్రోగ్రాముల్లో బ్యాచ్​లర్​ ఆఫ్ ఆర్కిటెక్చర్​, బ్యాచ్​లర్​ ఆఫ్​ ప్లానింగ్​ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో జేఈఈ మెయిన్​ –2022 ర్యాంక్​ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సైన్స్​ గ్రూపుల్లో ఇంటర్​ పూర్తి చేసిన వారు అర్హులు.

పీజీ ప్రోగ్రాముల్లో మాస్టర్​ ఆఫ్​ అర్కిటెక్చర్​, మాస్టర్​ ఆఫ్​ ప్లానింగ్​, మాస్టర్​ ఆఫ్​ బిల్డింగ్​ ఇంజినీరింగ్​ అండ్​ మేనేజ్​మెంట్​, మాస్టర్​ ఆఫ్​ డిజైన్​ కోర్సులు ఉన్నాయి. ఇందులో గేట్​, సీడ్​ స్కోర్​ ఆధారంగా అడ్మిష్లు ఇస్తారు. అర్కిటెక్చర్​, సివిల్​, కన్​స్ట్రక్షన్​ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

పీహెచ్​డీ ప్రోగ్రామ్​ ఫుల్​ టైమ్​ లేదా పార్ట్​ టైమ్ విధానంలో పూర్తి చేయవచ్చు. ఇందులో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇస్తారు. ప్లానింగ్​ అండ్​ అర్కిటెక్చర్​ విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులై మెరిట్​ ఉన్నవారికి లేదా గేట్​, సీడ్​ స్కోర్​ లేదా జేఆర్ఎఫ్​ అర్హత కలిగిన వారికి సీట్లు కేటాయిస్తారు. ​

Advertisement

అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసేందుకు మార్చి 28 చివరితేది. దరఖాస్తు ఫీజు రూ.2,500 చెల్లించాలి.

వెబ్​సైట్​ : www.spa.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!