HomeLATESTతెలంగాణ సోషియో ఎకనమిక్‌ సర్వే 2021–22

తెలంగాణ సోషియో ఎకనమిక్‌ సర్వే 2021–22

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మార్చి 7న శాసనసభలో తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-–2022 నివేదిక ప్రవేశపెట్టారు. ఏ సంక్షోభాన్నైనా ఎదుర్కొని నిలబడగలదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ నిరూపించుకుంది. గత రెండేళ్లలో కోవిడ్‌–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి వృద్ధి రేటులో తెలంగాణ మళ్లీ పూర్వపు దూకుడును అందుకుంది. స్థిర ధరల వద్ద 2021–22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 8.9 శాతం కాగా, తెలంగాణ 11.2 శాతం సాధించింది. ఈ నివేదిక ప్రకారం… ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్రం 19.1 శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ సగటు 19.4 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ రూ.11.6 లక్షల కోట్లు.

Advertisement

జీఎస్‌డీపీ

ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన తుది సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)/ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) అంటారు. ఆర్థికాభివృద్ధికి సూచికలుగా జీడీపీ, జీఎస్‌డీపీలను పరిగణిస్తారు.

తలసరి ఆదాయం రూ.2,37,632

వ్యక్తిగత స్థాయిలో ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలకు సూచికైన తలసరి ఆదాయం వృద్ధిలో రాష్ట్రం దూకుడు కొనసాగిస్తోంది. 2021–22లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,78,833 కాగా, జాతీయ సగటు రూ.1,49,848 మాత్రమే. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 1.9 రెట్లు అధికంగా ఉంది. 2020–21లో రాష్ట్రం రూ.2,37,632 తలసరి ఆదాయంతో 14 పెద్ద రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.

Advertisement

​​​​​​​టాప్​లో సర్వీస్​ సెక్టార్​​​​​​​​

రాష్ట్రాల జీఎస్డీపీకి మూడు ప్రధాన రంగాలైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాలు ఊతమిస్తాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ)నకు సేవల రంగమే ప్రధాన చేయూత ఇస్తోంది. తర్వాతి స్థానంలో పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలున్నాయి. 2021–22లో జీఎస్‌వీఏలో 61.3 శాతం వాటా సేవల రంగానిదే కాగా, 20.4 శాతం వాటా పారిశ్రామిక, 18.3 శాతం వాటా వ్యవసాయ, అనుబంధ రంగాలది.

వ్యవసాయ రంగంలో 48శాతం ఉపాధి

Advertisement

2014–15లో 16.3 శాతం ఉన్న వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2021–22లో 18.3 శాతానికి పెరిగింది. 2014–15లో మైనస్‌ 0.66 శాతం రుణాత్మక వృద్ధి రేటు కలిగిన రాష్ట్ర వ్యవసాయ, అనుబంధాల రంగాలు.. 2021–22లో 9.09 శాతం వృద్ధి రేటును సాధించడం దీనికి నిదర్శనమని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ తెలంగాణకు వెన్నుముకగా ఉన్న వ్యవసాయం 48 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్‌ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు సాగు అభివృద్ధికి దోహదపడ్డాయి.

ఎరువుల వినియోగం పెరిగింది

తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందుల వినియోగం భారీగా పెరిగిందని తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22 వెల్లడించింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం 2018లో 28లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 2020లో 39లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని తెలిపింది. సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, పంట రకం, పంట విధానం, పంట తీవ్రత, నేల రకం, దాని పరిస్థితి, వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు, రైతుల సామర్థ్యం వంటి అనేక కారణాల వల్ల ఎరువులు, పురుగు మందుల వినియోగం నిర్ణయిస్తారు. నీటి పారుదల సౌకర్యం గణనీయంగా పెరగడంతో సాగు విస్తీర్ణం అధికమైంది. దీంతో ఎరువుల వినియోగం పెరిగిందని తెలిపింది.

Advertisement

63 లక్షల మందికి రైతుబంధు

2021–22 యాసంగిలో దాదాపు 63 లక్షల మంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందారు. వీరిలో 72.58 శాతం మంది సన్నకారు రైతులు. 18.30 శాతం మంది చిన్న రైతులు. మిగిలినవారు పెద్దరైతులు. రైతుబంధు కింద ఇప్పటివరకు ఎనిమిది సీజన్లలో కలిపి రూ.50,448 కోట్లు రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. 2021–22 యాసంగిలో మొత్తం 63 లక్షల మంది లబ్ధిదారులలో 53 శాతం మంది బీసీలున్నారు. 13 శాతం మంది ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారున్నారు. రైతుబంధు మొత్తం సొమ్ములో 48 శాతం బీసీలకు, 30 శాతం ఇతరులకు, 13 శాతం ఎస్టీలకు, 9 శాతం ఎస్సీలకు పంపిణీ చేశారు.

75,276 కుటుంబాలకు రైతు బీమా

Advertisement

2018 నుండి తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఏ కారణం చేతనైనా రైతు ప్రాణాలు కోల్పోతే సంబంధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక ఉపశమనంగా రూ.5 లక్షల బీమా మొత్తం అందజేస్తుంది. ఈ ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2018–19 నుండి ప్రభుత్వం రూ.3,763.80 కోట్ల మేరకు క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఆ మొత్తాన్ని 75,276 పేద కుటుంబాలకు బదిలీ చేసింది. 2020–21సంవత్సరంలో రైతు బీమా కింద 32.7లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.

49 శాతం సాగు భూమి

తెలంగాణ రాష్ట్రం 276.96లక్షల ఎకరాలకు పైగా భౌగోళిక విస్తీర్ణంతో భారతదేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. మొత్తం విస్తీర్ణంలో 49.07 శాతం విస్తీర్ణం నికర సాగు ప్రాంతం. 24.07 శాతం అటవీ విస్తీర్ణంలో ఉంది. వ్యవసాయేతర ఉపయోగాలకు కింద భూమి దాదాపు 7.46 శాతం, బీడు భూములు 9.02 శాతం, బంజరు, సాగుకు యోగ్యత లేని భూమి 5.42 శాతం ఉంది. ఇతరత్రా సాధారణ భూములున్నాయి.​​​​​​​

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!