HomeLATEST8వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1000.. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్

8వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1000.. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్

ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్​. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్​ మీన్స్​ కమ్​ మెరిట్​ స్కాలర్​షిప్​ ప్రకటన విడుదలైంది. దీనికి ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రతి నెలా రూ.1000 చొప్పున స్కాలర్ షిప్​గా అందిస్తారు. కేంద్ర మానవ వనరుల విభాగం ఈ స్కాలర్ షిప్​లను అందిస్తోంది. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.5 లక్షలకు మించకూడదనే నిబంధన ఉంది.

ఈ స్కాలర్ షిప్ కు రాష్ట్రాల వారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తాయి. లక్ష స్కాలర్‌షిప్పులను రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన విభజించారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 4,087, తెలంగాణకు 2,921 కేటాయించారు.

ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌-1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్, పార్ట్‌-2 స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (ఎస్‌ఏటీ) ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించడానికి రెండు విభాగాల్లోనూ కనీసం 40 (ఎస్సీ, ఎస్టీలు 32) శాతం మార్కులు రావాలి. జనరల్‌ అభ్యర్థులైతే ప్రతి పేపర్‌లోనూ 36, ఎస్సీ, ఎస్టీలకు 29 చొప్పున మార్కులు సాధించాలి. ఈ ఉపకార వేతనం కొనసాగాలంటే ప్రతి తరగతిలోనూ నిర్దేశిత మార్కులు సాధించడం తప్పనిసరి. వీరు పదో తరగతిలో కనీసం 60 (ఎస్సీ, ఎస్టీలు 55) శాతం పొందితేనే స్కాలర్‌షిప్పు కొనసాగుతుంది.

దరఖాస్తులు:  ఇప్పటికే ఏపీలో ఈ ప్రకటన వెలువడింది. దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో కొద్ది రోజుల్లో వెలువడుతుంది. ఏపీలో అక్టోబర్ 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ అభ్యర్థులు వివరాలకు www.bse.telangana.gov.in వెబ్​ సైట్​ ను చెక్​ చేసుకోవాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!