HomeFeaturedBANK EXAMSSBI ఆఫీసర్ ఉద్యోగాలకు బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్​

SBI ఆఫీసర్ ఉద్యోగాలకు బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్​

బ్యాంక్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రొబేషనరీ ఆఫీసర్ల నోటిఫికేషన్‌ను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) విడుదల చేసింది. దీని ద్వారా 1673 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతలున్న నిరుద్యోగులకు బ్యాంక్ జాబ్​ సంపాదించే మంచి అవకాశం దొరికింది. మూడు దశల్లో ఈ సెలెక్షన్​ జరుగుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలనేది నిరుద్యోగుల కల. మంచి జీతం, తక్కువ సమయంలోనే ప్రమోషన్స్, ఆకర్షణీయమైన అలవెన్స్లు బ్యాంక్ ఎంప్లాయిస్ కు ఉంటాయి.

Advertisement

గతంలో జరిగిన పరీక్షతో పోల్చితే మెయిన్స్‌ పరీక్ష విధానంలో ఈసారి స్వల్ప మార్పులు ఉన్నాయని గమనించాలి. రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగంలోని ప్రశ్నల సంఖ్యను 5 చొప్పున, మార్కులను 10 చొప్పున కుదించారు. అక్కడ కుదించిన 10 ప్రశ్నలు- 20 మార్కులను జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో కలిపారు. కాబట్టి మొత్తం ప్రశ్నల సంఖ్య, మార్కుల్లో మార్పేమీ లేదు. ఈసారి జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం ప్రాధాన్యం పెరిగిందని అభ్యర్థులు గుర్తించాలి. ప్రిలిమ్స్‌ పరీక్షలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

నోటిఫికేషన్

విద్యార్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు (01.04.2022 నాటికి): జనరల్‌ అభ్యర్థులు 21- నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:    రూ.750 (జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌).  ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆక్టోబర్ 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రిలిమ్స్:     డిసెంబర్ 17/18/19/20 తేదీల్లో ఉంటుంది.
మెయిన్స్‌: జనవరి/ఫిబ్రవరి 2023
వెబ్‌సైట్‌: www.sbi.co.in

ఎగ్జామ్ ప్యాటర్న్

అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున మెయిన్స్‌ కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ లో ఉత్తీర్ణులైన వారి నుంచి ఒక్కో పోస్టుకు 5 మంది అభ్యర్థులను మూడో దశకు ఎంపిక చేస్తారు. ఈ దశలో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. సైకోమెట్రిక్‌ టెస్ట్‌ నిర్వహించినా ఇది అర్హత పరీక్ష మాత్రమే.

Advertisement

రెండో దశ మెయిన్స్‌లోని మొత్తం మార్కులు 75గా పరిగణిస్తారు, మూడో దశలోని గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలోని మొత్తం 25 మార్కులుగా లెక్కిస్తారు. మొత్తం 100 మార్కులకుగాను అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

పీవో ప్రిలిమ్స్

సబ్జెక్ట్ప్రశ్నలుమార్కులు
ఇంగ్లిష్3030
ఆప్టిట్యూడ్ 3535
రీజనింగ్ 3535
మొత్తం 100100

మెయిన్స్

Advertisement
సబ్జెక్ట్ప్రశ్నలుమార్కులు
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్4050
డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 3050
జనరల్ ఎకానమి అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్5060
ఇంగ్లిష్3540
మొత్తం155200

లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే 2 50
గ్రూప్ ఎక్సర్ సైజ్ 20 మార్కులు
ఇంటర్వ్యూ 30 మార్కులు

డిసెంబర్లో ప్రిలిమ్స్

ఒకేసారి ఎస్‌బీఐ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్‌, క్లర్క్‌ నోటిఫికేషన్లు వచ్చాయి. కాబట్టి పీఓ పరీక్షకు సిద్ధమైతే  క్లర్క్‌ పరీక్షకు సరిపోతుంది. పీఓ పరీక్షను లక్ష్యంగా చేసుకుంటే పరీక్ష తేదీకి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక వేసుకోవాలి. ప్రిలిమ్స్‌ డిసెంబర్ 17, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనుండడంతో దాదాపు 75 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో సరైన ప్రణాళికతో ప్రిపేర్‌ అయితే మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులైనా విజయం సాధించవచ్చు.

Advertisement

ప్రిపరేషన్ ప్లాన్

ప్రిలిమ్స్, మెయిన్స్ లో కొన్ని మినహా చాలా వరకు సేమ్ టాపిక్స్ ఉన్నాయి. అందుకే మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పూర్తయినట్లే.


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌:
 ప్రిలిమ్స్లో ఉన్న ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్, నంబర్‌ సిరీస్, అప్రాక్సిమేట్‌ వాల్యూస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, పర్ముటేషన్‌-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్,అర్థమెటిక్‌ టాపిక్స్‌ ఉంటాయి.

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమ్స్, మెయిన్స్‌.. రెండిట్లోనూ రీజనింగ్‌ ఉంది. ఎస్‌బీఐ పీవో రీజనింగ్‌ ప్రశ్నలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవిగా అనిపించేలా ఉంటాయి. కంప్యూటర్‌ నాలెడ్జ్ నుంచి 5-10 ప్రశ్నలు రావొచ్చు.

Advertisement


డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌: 
మెయిన్స్‌లోని ఈ టాపిక్ కోసంఅర్థమెటిక్‌ టాపిక్స్‌ బాగా ప్రిపేర్ కావాలి.టేబుల్స్, లైన్‌ గ్రాఫ్‌లు, బార్‌ డయాగ్రమ్‌లు, పై చార్టులు, కేస్‌లెట్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. కాలిక్యులేషన్స్‌ వేగంగా చేయగలగాలి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే  మార్కులు ఎక్కువ స్కోర్ చేయవచ్చు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ప్రిలిమ్స్, మెయిన్స్‌లతో పాటు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లోనూ ఈ టాపిక్ ఉన్నందున దీనిపై అభ్యర్థులు ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్రామర్పై  ఎక్కువగా పట్టు పెంచుకోవాలి. ప్యాసేజీని వేగంగా చదివి, అర్థం చేసుకోగలిగితే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు త్వరగా సాధించవచ్చు. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ కోసం లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ ప్రాక్టీస్ చేయాలి.

 
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: 
కరెంట్ అఫైర్స్, బ్యాకింగ్ టర్మినాలజీ, స్టాండర్డ్‌ జీకేల నుంచి ప్రశ్నలు అడుగుతారు. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. గత ఐదారు నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి.

Advertisement

సేమ్ స్ట్రాటజీ

ఆర్ఆర్బీ మినహా ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్‌ పీఓ, ఎస్‌ఓ, ఆర్‌ఆర్‌బీ పీఓ, క్లర్క్‌ ప్రిలిమ్స్ పరీక్షలన్నింటికీ ఒకటే ప్రిపరేషన్ సరిపోతుంది. ప్రశ్నలు అడిగే స్థాయిలో మార్పులు ఉన్నా సిలబస్లో మాత్రం పెద్దగా మార్పులు ఏమి ఉండవు. ప్రివియస్ పేపర్స్ పరిశీలించి ప్రిపరేషన్ సాగించాలి. ఐబీపీఎస్ ఎగ్జామ్కు సిద్ధమవుతున్న వారు అదే ప్రిపరేషన్ ఎస్బీఐ పీవోకు కూడా కొనసాగించాలి. ఆప్టిట్యూడ్, రీజనింగ్‌కు ఎక్కవ సమయం కేటాయించి ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజూ మోడల్‌ పరీక్షలు రాయడం తప్పనిసరి. దాంతో ఏ విభాగంలో పట్టు ఉంది, ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో తెలుసుకోవచ్చు. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సమయం తక్కువ ఉన్నందున టైమ్మేనేజ్మెంట్ చాలా ముఖ్యం.

ఓబీసీలకు ఏడు సార్లు చాన్స్

ఇతర బ్యాంకు పరీక్షల్లా కాకుండా ఎస్‌బీఐ పీఓ పరీక్ష రాయడానికి కొన్ని పరిమితమైన అవకాశాలుంటాయి. జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 4 సార్లు, ఓబీసీ అభ్యర్థులకు 7 సార్లు మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం అపరిమితంగా రాసుకోవచ్చు. అయితే ఈ పరిమితి ప్రిలిమినరీ పరీక్షకు కాకుండా మెయిన్స్‌ పరీక్షకు మాత్రమే ఉంటుంది. 2010లో జరిగిన పరీక్ష నుంచి ఈ అవకాశాలను లెక్కిస్తారు.

పీవోగా జాయినై.. చైర్మన్ గా రిటైర్ అవ్వొచ్చు

ఎస్‌బీఐలో పీవోగా సెలక్ట్ అయితే రెండు సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియమిస్తారు. అద్భుత ప్రతిభ కనబరిచిన వారు అంచెలంచెలుగా డిఫ్యూటీ మేనేజర్‌, మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, ఏజీఎం, డీజీఎం, జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్, డిఫ్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, మేనేజింగ్‌ డైరెక్టర్, చివరకు చైర్మన్‌ హోదా వరకూ చేరుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు విదేశాల్లోనూ బ్రాంచీలు ఉన్నందున టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే ఇతర దేశాల్లోనూ పనిచేసే అవకాశం ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!