తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎస్‌సీఏబీ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 40 మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పోస్టులకు అనుగుణంగా ఆన్ లైన్లో వేర్వేరు అప్లికేషన్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువుగా నిర్ణయించారు.
పోస్టులు: మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి.
మేనేజర్(స్కేల్-1)– 27,
స్టాఫ్ అసిస్టెంట్– 13 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు; ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులుండాలి. వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: మేనేజర్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్ & డిస్క్రిప్టివ్) ఆధారంగా, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్) ఆధారంగా నియమిస్తారు.
I have completed M. Sc(MATHS)