ఈ నెల 13 న జరగాల్సిన ఈసెట్ (ECET) పరీక్షను వాయిదా వేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. త్వరలోనే ECET పరీక్ష నిర్వహించే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. అగ్రికల్చర్… ఫార్మసీ స్ట్రీమ్ ఎగ్జామ్స్ ఈ నెల 14,15వ తేదీల్లో, ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ఈ నెల 18, 19, 20వ తేదీల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని, ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి కావటంతో ఎంసెట్ ఎగ్జామ్ను యథాతథంగా నిర్వహించేందుకు కౌన్సిల్ మొగ్గు చూపింది.