పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యా కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పించేందుకు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పాలిటెక్నిక్ 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో అడ్మిషన్స్ ఇస్తారు.
వీటితో పాటు తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ విద్యాసంస్థలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో నిర్వహించే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ 2024 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కోర్సులలో డిప్లొమా కోర్సులకు ప్రవేశాలను అందిస్తుంది. విద్యార్థులకు అడ్మిషన్లు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ – పాలీసెట్ 2024 ద్వారా జరుగుతాయి.
అప్లికేషన్స్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 22 వరకు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రూ.250గా నిర్ణయించారు. ఇతర కేటగిరీల విద్యార్థుల కోసం దరఖాస్తులు రూ.500 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష 17 మేన నిర్వహించబడుతుంది. ఫలితాలు మే 2024 చివరి నాటికి ప్రకటించబడతాయి. మరిన్ని వివరాలు www.polycet.sbtet.telangana.gov.in లో అందుబాటులో ఉన్నాయి.