తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు టీఎస్పీఎస్సీ (TSPSC) సిద్ధమైంది. ఎల్లుండి మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-2 నోటిఫికేషన్ (TSPSC Group-2 Notification) ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయని పక్షంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది. వాస్తవానికి మొన్న జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన రోజే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయాలని గ్రూప్-2 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అయితే.. కారణం ఏంటో తెలియదు కానీ.. ఆఖరి నిమిషంలో గ్రూప్-2 నోటిఫికేషన్ ను వాయిదా వేసి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.
READ THIS: వారంలో మరో 4 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
మొత్తం 728 ఖాళీలు..
వివిధ ప్రభుత్వ శాఖలు ఇచ్చిన తాజా సమాచారంతో గ్రూప్-2 కు సంబంధించి మొత్తం 728 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది. ఈ ఖాళీల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం సైతం లభించింది. దీంతో కొన్ని రోజులుగా గ్రూప్ 2 పోస్టుల భర్తీ పైనే టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అందుకే ఎల్లుండి జరిగే బోర్డు మీటింగ్లో తుది నిర్ణయం తీసుకొని షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఒక వేళ ఏదైనా కారణం చేత గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయలేకపోతే.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది.