పదో తరగతి పరీక్షల టైమింగ్.. సిలబస్.. పేపర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ముందుగా ప్రకటించిన మేరకు ఆరు పేపర్లు..3.15 గంటల టైమింగ్.. 70 శాతం సిలబస్ యథాతథంగా అమల్లో ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లకు ఉపయోగపడేలా గతంలో రిలీజ్ చేసిన షెడ్యూలును మళ్లీ ఇక్కడ అందుబాటులో ఉంచటమైనది.