టీచర్ ఎలిజిబులిటెస్ట్ TS TET 2022 దరఖాస్తుల ప్రక్రియ మార్చి 26న ప్రారంభమైంది. ఇప్పటి వరకు సుమారు 3 లక్షలు 80వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. టెట్ అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా రూ.300 చెల్లించి ఆ తర్వాత వచ్చిన జనరల్ నంబర్ ఎంట్రీ చేసి టెట్ అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, గత టెట్లో హయ్యెస్ట్ మార్కుల వివరాలు, టెట్ హాల్ టికెట్ నంబర్, స్టడీ క్వాలిఫికేషన్స్డీఈడీ, బీఈడీ చదివిన కాలేజీల ఎంపికలో తప్పులు చేసిన వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
టెట్ అప్లై చేసేందుకు ఏప్రిల్ 12 వరకు సమయం ఉండడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ‘వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్’ పెట్టనున్నట్టు సమాచారం. ఎడిట్ ఆప్షన్ ద్వారా అభ్యర్థులు తమకు ఇచ్చిన ఐడీనంబర్ ఎంట్రీ చేసి అప్లికేషన్లో నమోదు చేసిన వివరాల్లో తప్పులు సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే 040-23120340, 23120433, 8121010310, 8121010410 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. టెట్ హాల్‌టికెట్లను జూన్ 6 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు పేపర్–1, పేపర్–2 కలిపి 3.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో టెట్ పేపర్–1కు భారీగా 2 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. టెట్ అప్లికేషన్ గడువు మరోవారం రోజుల పాటు పొడిగించాలని ఇప్పటికే విద్యాశాఖకు అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు.