ఎంబీబీఎస్, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ (NEET UG 2022) నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ 2022 షెడ్యూల్ విడుదల అయింది. జూలై 17న (ఆదివారం) ఈ ఎంట్రన్స్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి మే 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలు నీట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
