జేఈఈ, నీట్‌తో పాటు పలు పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. 2023-24 అకడమిక్ ఇయర్లో జరిగే పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్ JEE (MAIN) 2023 ఫస్ట్ సెషన్, ఏప్రిల్ 6వ తేదీ నుంచి జేఈఈ సెకండ్ సెషన్ జరగుతుందని ఎంట్రన్స్ తేదీలను వెల్లడించింది. మే 7వ తేదీన నీట్ (యూజీ) NEET (UG) పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఐకార్ (ICAR AIEEA 2023) ఏప్రిల్ 26 నుంచి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET 2023) మే 21 నుంచి 30 వ తేదీ వరకు జరుగుతుంది.