HomeLATESTనల్సార్ యూనివర్సిటీలో ఎంబీఏ: ఆగస్టు 10 వరకు అప్లై ఛాన్స్​

నల్సార్ యూనివర్సిటీలో ఎంబీఏ: ఆగస్టు 10 వరకు అప్లై ఛాన్స్​

దేశంలో పేరొందిన హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాలోని మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ వింగ్​ ఈ ఏడాది ఎంబీఏ అడ్మిషన్లకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆగస్టు 10లోపు దరఖాస్తు
చేసుకోవాలి.

Advertisement

ప్రోగ్రామ్‌: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ).

నల్సార్ అందిస్తున్న ఎంబిఎ పూర్తిగా ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్. ఎకనామిక్స్, మేధమెటిక్స్, స్టాటిస్టిక్స్ బిజినెస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ ఫండమెంటల్స్తో మొదలుపెట్టి లా, అకౌంటెన్సీ, కోర్ట్ మేనేజ్మెంట్ వంటి అంశాలన్నింటినీ కలగలిపి ఈ కోర్సును తీర్చిదిద్దింది. రెండేళ్ళ పాటు ఉండే ఈ కోర్సులో ఆరు టెర్మ్లు ఉంటాయి. కోర్సులో చేరిన ప్రతి విద్యార్థి మూడు ఇంటర్న్షిప్లు, పన్నెండు లైవ్ ప్రాజెక్టులు, మెటర్న్​షిప్స్​ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ అనుభవానికి ప్రాధ్యాన్యం ఉన్న కోర్సు ఇది

స్పెషలైజేషన్లు; ఫైనాన్షియల్ సర్వీసెస్, అండ్ కేపిటల్ మార్కెట్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్
అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్నోవేషన్ అండ్ సస్టయినబిలిటీ మేనేజ్మెంట్, బిజినెస్ రెగ్యులేషన్స్, కోర్ట్ మేనేజ్ మెంట్

అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.

సెలెక్షన్ ప్రాసెస్; క్యాట్, ఎక్స్ఎటి జిఆర్ఇ, జిమ్యాట్, సీమ్యాట్ స్కోర్లో ఏదైనా ఆమోదిస్తారు. ఇవేవీ లేనిపక్షంలో నల్సార్ మేనేజ్ మెంట్ ఎంట్రెన్స్ టెస్ట్ను ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. దీన్ని ఆగస్టు 16న నిర్వహిస్తున్నారు. అదే రోజు ఆన్లైన్ మోడ్లోనే గ్రూప్ డిస్కషన్, ఇంటర్య్వూ ఉంటాయి.

* ఎంట్రన్స్​ తేదీ: ఆగస్టు 16
* ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు చివరితేదీ: ఆగస్టు 10
* వెబ్‌సైట్‌: https://www.nalsar.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!