దేశంలోని టాప్ కాలేజీల్లో ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థులకు బెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ జాట్.. జేవియర్ అప్టిట్యూడ్ టెస్ట్ (XAT 2023). క్యాట్ తర్వాత పేరొందిన ఎంట్రన్స్ టెస్ట్ ఇది. మేనేజ్‌మెంట్ కోర్సుల అడ్మిషన్లకు దేశంలోని వివిధ కాలేజీలు ఈ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇందులో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా 160 బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ/ పీజీడీఎం కోర్సుల్లో అడ్మిషన్లు పొందే వీలుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఇటీవలే XAT- 2023 నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
కోర్సులు:
పీజీడీఎం PGDM: బిజినెస్ మేనేజ్‌మెంట్ (BM), హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (HRM), జనరల్ మేనేజ్‌మెంట్ (GM), ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెంచర్ క్రియేషన్ (IEV). వీటిని ఫుల్‌టైం రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారు.
ఫెలో ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (FPM): పీజీ పూర్తి చేసిన వారు, ప్రొఫెషనల్ కోర్సులు చదివినవాళ్లు, పని అనుభవం ఉన్నవారికోసం ఉద్దేశించిన ఈ కోర్సు నాలుగేళ్ల వ్యవధితో అందుబాటులో ఉంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్లో నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామ్ 2023 జనవరి 8 వ తేదీన నిర్వహిస్తారు. పూర్తి వివరాలు www.xatonline.in వెబ్ సైట్లో ఉన్నాయి.