ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా జాబ్ మేళలను (Job Mela) నిర్వహిస్తున్నారు. తాజాగా ఆధ్యగోలి ఫౌండేషన్ చైర్మన్ డా.మోహన్ గోలి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఈ నెల 12న శనివారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో భారీ జాబ్ మేళను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళాలో 183 కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. తద్వారా పది వేలకు పైగా ఉద్యోగావకాశాలు (Jobs) కల్పించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు కనీసం రూ.11 వేల నుంచి రూ.35 వేల వరకు శాలరీ అందుకునే ఛాన్స్ ఉంటుంది. వేములవాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను నిరుద్యోగ రహితంగా మార్చే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్-LINK
రంగాలు: ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.
విద్యార్హతలు: ఈ జాబ్ మేళాలో పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, టెన్త్, డిప్లొమా, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు పాల్గొనవచ్చు.