Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSGovt Jobs 2022: టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మొత్తం 1671 జాబ్స్.. వెంటనే...

Govt Jobs 2022: టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మొత్తం 1671 జాబ్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా..

నిరుద్యోగులకు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (Jobs in IB) భారీ శుభవార్త చెప్పింది. 1671 ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ (IB Job Notification) విడుదల చేశారు. సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. మొత్తం 1671 ఖాళీల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1521 కాగా.. ఎంటీఎస్ పోస్టులు 150 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల అంటే నవంబర్ 5వ తేదీన ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి అదే నెల నవంబర్ 25ను ఆఖరి తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ mha.gov.inలో సమర్పించాల్సి ఉంటుంది. టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు అధికారులు.

Advertisement

విద్యార్హత: ఈ ఉద్యోగాలకు విద్యార్హతను కేవలం టెన్త్ గా నిర్ణయించారు. టెన్త్ పాసైన వారు ఈ 1671 ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు వయోపరిమితి 27 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేతనాలు: సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21700 నుంచి రూ.69100 వేతనం చెల్లించనున్నారు. ఎంటీఎస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల నుంచి రూ.56900 వరకు వేతనం ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!