Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSTelangana Job mela: 153 కంపెనీల్లో 10 వేలకు పైగా జాబ్స్.. రూ.35 వేల జీతం

Telangana Job mela: 153 కంపెనీల్లో 10 వేలకు పైగా జాబ్స్.. రూ.35 వేల జీతం

ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా జాబ్ మేళలను (Job Mela) నిర్వహిస్తున్నారు. తాజాగా ఆధ్యగోలి ఫౌండేషన్ చైర్మన్ డా.మోహన్ గోలి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఈ నెల 12న శనివారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో భారీ జాబ్ మేళను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళాలో 153 కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. తద్వారా పది వేలకు పైగా ఉద్యోగావకాశాలు (Jobs) కల్పించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు కనీసం రూ.11 వేల నుంచి రూ.35 వేల వరకు శాలరీ అందుకునే ఛాన్స్​ ఉంటుంది. వేములవాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను నిరుద్యోగ రహితంగా మార్చే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పౌండేషన్​ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్-LINK

Advertisement


రంగాలు: ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.

విద్యార్హతలు: ఈ జాబ్ మేళాలో పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, టెన్త్, డిప్లొమా, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు పాల్గొనవచ్చు.

Advertisement

వయోపరిమితి: ఈ జాబ్ మేళాలో పాల్గొనాలనుకుంటున్న వారి వయస్సు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

-అభ్యర్థులు వివరాలకు 6304733678, 9951237722, 8978909044 నంబర్లను సంప్రదించవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!