త్వరలోనే పోలీసు ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు హోంశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కమిషన్లు, ఎస్పీలకు రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు చేశారు. నిరుద్యోగ యువతను ప్రోత్సహించి, పేద, బలహీన వర్గాల వారికి ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్తో సమన్వయం చేసుకుని అన్ని వసతులతో ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన 18,334 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు శాఖ అన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన వెంటనే మొట్టమొదటగా పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో భర్తీ ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు సమాచారం. 1,500కు పైగా ఎస్సై పోస్టులు, మిగిలినవన్నీ ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్), టీఎస్‌ఎస్‌పీ, కమ్యూనికేషన్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అత్యధిక సంఖ్యలో పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్, స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్‌ఎస్‌పీ), పోలీస్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీవో) విభాగాల్లోని కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్లు సుమారు 28వేల పోస్టులను భర్తీ చేశారు. కొత్త జిల్లాలు, మండలాలు, నూతన పోలీసు స్టేషన్ల ఏర్పాటు నేపథ్యంలో సిబ్బంది కేటాయించేందుకు ఈ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్టు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి.
పోలీస్ జాబ్స్ ప్రిపేరయ్యే అభ్యర్థులకు ప్రతి జిల్లాలో ఫ్రీ కోచింగ్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS