జేఈఈ (మెయిన్) JEE MAINS-2022 ఫస్ట్ సెషన్ తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 16 నుంచి మొదలు కావాల్సిన ఈ పరీక్షలను అయిదు రోజుల పాటు వాయిదా వేస్తూ ఎన్టీఏ కొత్త షెడ్యూలు విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల బోర్డు పరీక్షలు జరుగుతున్న టైమ్‌లో జేఈఈ పరీక్షల డేట్లు కూడా క్లాష్ కావటంతో విద్యార్థులకు ఇబ్బంది కరంగా మారింది. అందుకే విద్యార్థులు తల్లిదండ్రుల కోసరిక మేరకు పరీక్షల షెడ్యూలులో మార్పులు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ సెషన్ ఎగ్జామ్‌లకు సంబంధించి కొత్త షెడ్యూలును విడుదల చేసింది. మారిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు.
