డీఎస్సీ (DSC 2023–తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5089 పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలున్నాయి. అభ్యర్థుల నుంచి ఈ నెల 20 వ తేదీ నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 21వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను నోటిఫికేషన్తో పాటు ప్రకటించింది. జిల్లాల వారీగా నియామకాలు చేపట్టి ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
డీఎస్సీకి తొలిసారిగా (CBRT) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో వచ్చే మార్కుల మెరిట్, రిజర్వేషన్ కోటా ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 20వ తేదీ నుంచి 30 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. 15వ తేదీ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ అఫిషియల్ వెబ్ సైట్లో పూర్తి వివరాల యూజర్ గైడ్ అందుబాటులో ఉంటుంది.
నోటిఫికేషన్, గైడ్ లైన్స్ పీడీఎఫ్ ఇక్కడ అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు