స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 2 వేల ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ (SBI PO Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ లింక్: https://bank.sbi/web/careers#lattest
విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 21-30 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ / EWS మరియు OBCలకు రూ.750 దరఖాస్తు ఫీజు ఉంటుంది. SC / ST, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు ఉండదు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్: సెప్టెంబర్ 6
దరఖాస్తులు: సెప్టెంబర్ 7 నుంచి 27
ప్రిలిమ్స్ ఎగ్జామ్: నవంబర్ 2023
అభ్యర్థుల ఎంపిక:
ప్రిలిమ్స్
మెయిన్స్
ఇంటర్వ్యూ