HomeLATESTకొత్త జిల్లాల వారీగా టీచర్​ పోస్టుల ఖాళీలు

కొత్త జిల్లాల వారీగా టీచర్​ పోస్టుల ఖాళీలు

తెలంగాణాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల ఖాళీలపై విద్యాశాఖ నివేదికలో వెల్లడించింది. అయితే రేషనలైజేషన్​ ప్రక్రియ నిర్వహించిన తర్వాత ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డీఎస్సీలో భర్తీ చేసే పోస్టుల్లో ఈ లెక్కన పోస్టులు తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. తెలంగాణాలో ఇప్పటి వరకు 2017లో టీచర్ల భర్తీకి తొలి నోటిఫికేషన్​ వెలువడింది. ఈ పరీక్షను 2018లో నిర్వహించారు. ఆ సమయానికి కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినా.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాత 10 జిల్లాల ప్రాతిపదిక గానే టీచర్ల నియామకాలు చేపట్టారు. అయితే ప్రస్తుతం నిర్వహించబోయే డీఎస్సీ 33 కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించనున్నారు. జిల్లా యూనిట్​గా నియామకాలు చేపట్టే డీఎస్సీలో ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు పోటీ పడే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో పోస్టుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా విద్యాశాఖ విడుదల చేసిన ఖాళీల లెక్కను ఇక్కడ తెలుసుకోండి.

స్కూల్​ అసిస్టెంట్​2200
లాంగ్వేజ్​ పండిట్700
ఫిజికల్​ ఎడ్యుకేషన్​ టీచర్​ అండ్​ పీడీ170
మొత్తం ఖాళీలు9770
నాన్ టీచింగ్2700

33 జిల్లాల వారీగా.. సెకండరీ గ్రేడ్​ పోస్టుల ఖాళీలు

ఆదిలాబాద్ 203
భద్రాద్రి కొత్తగూడెం150
హైద్రాబాద్180
జగిత్యాల159
జనగాం101
జయశంకర్​ భూపాల్ పల్లి138
జోగులాంబ గద్వాల57
హన్మకొండ106
కామారెడ్డి260
కరీంనగర్123
ఖమ్మం342
కుమురం భీం ఆసిఫాబాద్222
మహబూబాబాద్256
మహబూబ్ నగర్220
మంచిర్యాల162
మేడ్చల్165
మెదక్147
ములుగు108
నాగర్ కర్నూల్120
నల్గొండ340
నారాయణపేట168
నిర్మల్120
నిజామాబాద్277
పెద్దపల్లి12
సిరిసిల్ల62
రంగారెడ్డి214
సంగారెడ్డి 207
సిద్దిపేట 152
సూర్యాపేట 210
వికారాబాద్ 205
వనపర్తి 48
వరంగల్ 160
యాదాద్రి భువనగిరి125
మొత్తం5519

పైవన్నీ తెలుగు మీడియం స్కూళ్లో ఉన్న ఖాళీ పోస్టులు. వీటితో పాటు ఇంగ్లిష్ మీడియం ఉర్దూ మీడియం కన్నడ ,మరాఠీ మీడియంలో 1181 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్నీ కలిపి 6700 పోస్టులు ఎస్టీజీలు ఉన్నాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!