దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేయాలనుకునే అభ్యర్థులకు వీలుగా.. కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న డిస్టెన్స్ డిగ్రీ నోటిఫికేషన్ వెలువడింది. 2022-23 విద్యా సంవత్సరానికి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 10 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
