వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో డెయిరీ టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది. పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం ఈ కోర్సును అందిస్తోంది.
కోర్సు; డెయిరీ టెక్నాలజీ
కాల వ్యవధి; నాలుగేళ్లు
అర్హత; ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఈ కోర్సులో చేరవచ్చు. మన రాష్ట్రంలో కామారెడ్డిలో మాత్రమే ఈ కళాశాల ఉంది.
సీట్లు; ఇక్కడ ఏటా 35 మంది విద్యార్థులు చేర్చుకుంటారు. వీటిలో 25 సీట్లు నేరుగా భర్తీ చేస్తారు.
ఫార్మర్స్ కోటా కింద ఆయిదు, ఐసీఏఆర్ నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఎంపికైనా వారికి మరో అయిదు కలిపి మొత్తం 35 సీట్లు ఈ కళాశాలలో ఉంటాయి.
కోర్సు వివరాలు;
ఈ కోర్సులో చేరిన వారు మూడు సంవత్సరాల పాటు డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రోబయాలజీ, డెయిరీ ఇంజనీరింగ్, డెయిరీ బిజినెస్ మేనేజ్ మెంట్ తదితర కోర్సులను చదవాల్సి ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తుల తయారీ, సంరక్షించుకోవడం, సంబంధిత బిజినెస్ వంటి విషయాలను నేర్చుకుంటారు.
ఇప్లాంట్ ట్రైనింగ్
నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్లో 105 రోజులు ఇప్లాంట్ ట్రైనింగ్ పేరుతో హెరిటేజ్, దొడ్ల, విజయ డెయిరీ లాంటి కంపెనీలలో ప్రాక్టికల్ శిక్షణ ఇప్పిస్తారు. సెకండ్ సెమిస్టర్లో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ ఎక్సిఫీరియెన్స్ లెర్నింగ్ (హెబీఈఎల్) కోర్సు ఉంటుంది. అంటే పాల ద్వారా తయారు చేసే ఉత్పత్తులకు సంబందించిన పూర్తి శిక్షణ విద్యార్థులకు ఉంటుంది. పాల ఉత్పత్తులను తయారుచేయడం, వాటికి మార్కెటింగ్, పాల నుంచి స్వీట్స్, లస్సీ తదితర విషయాలను నేర్చుకుంటారు. అంతేకాకుండా తయారు చేసిన పాల ఉత్పత్తులను వారే విక్రయిస్తారు.
బీటెక్ డెయిరీ టెక్నాలజీ పూర్తి చేసిన విద్యార్థులు ఎంటెక్ డెయిరీ టెక్నాలజీ లేదా ఫుడ్ టెక్నాలజీ కోర్సులను చేయవచ్చు. అయితే ఆ కోర్సులు మన రాష్ట్రంలో లేవు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవచ్చు.
డెయిరీ టెక్నాలజీ కోర్సు కేరాఫ్ కామారెడ్డి
Advertisement