ఇటు చంద్రయాన్ 3.. అటు ఆదిత్య ఎల్1 మిషన్‌ను విజయవంతం చేసిన ఇస్రో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత్ అంతరిక్ష అన్వేషణ ప్రయాణం, చంద్రుడిపై అద్భుతాలను అన్వేషించడానికి కారణమైన విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలపై చంద్రయాన్-3 మహాక్విజ్ నిర్వహిస్తోంది. ఇందులో అత్యంత ప్రతిభ చూపిన వారికి రూ.లక్ష నజరానా ప్రకటించింది. భారత పౌరులందరూ ఈ క్విజ్‌లో పాల్గొనేందుకు అర్హులే. ఈ ఆన్లైన్ క్విజ్‌లో పది ప్రశ్నలుంటాయి. 5 నిమిషాల్లో వీటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారెవరైనా సరే ఇక్కడున్న లింక్‌పై isroquiz.mygov.in క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసిన వెంటనే క్విజ్ ప్రారంభమవుతుంది.
ఫస్ట్ విన్నర్‌కు రూ.1 లక్ష, సెకండ్ విన్నర్‌కు రూ.75 వేలు, థర్డ్ విన్నర్‌కు రూ.50 వేల నగదు బహుమతిగా అందిస్తారు. తర్వాత వంద మందికి రూ.2000 చొప్పున కన్సోలేషన్ బహుమతి అందిస్తారు. ఆ తర్వాత ప్రతిభ కనబరిచిన 200 మందికి రూ.1000 చొప్పున కన్సోలేషన్ బహుమతిగా అందిస్తారు. ఆలస్యం చేయకండి.. వెంటనే క్విజ్‌లో పాల్గొనండి. ఆల్ ది బెస్ట్

My job.in chandra yantra 3
My gov.in chandrayan3