దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతో పాటు ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ అడ్మిషన్స్‌కు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2022) నోటిఫికేషన్ జులై 31న విడుదల కానుంది. నవంబర్ 27న ఈ ఎగ్జామ్ జరుగనుంది. కాట్-2022 నిర్వహణ బాధ్యతలు చూస్తున్న బెంగుళూరు ఐఐఎం ఈ విషయాన్ని ప్రకటించింది. ఆగస్ట్ 1 వ తేదీ నుంచి క్యాట్ 2022 వెబ్ సైట్ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి అప్లికేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఐఐఎం లతో పాటు ఎంబీఏ, ఇతర మేనేజ్మెంట్ ప్రోగ్రాం ల లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా CAT ని నిర్వహిస్తారు.అనేక ఇతర బిజినెస్ స్కూల్స్ కూడా ఈ CAT స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి.
దరఖాస్తులు: ఆన్లైన్
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 3
ఎగ్జామ్: నవంబర్ 27
పరీక్ష ఫలితాలు: 2023 జనవరిలో విడుదల (tentative)
విద్యార్హత : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసి రిజల్ట్ వెయిటింగ్ లో ఉన్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్
సెక్షన్ | ప్రశ్నలు | సమయం |
వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ | 26 | 40 |
డేటా ఇంటర్ ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ | 24 | 40 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 26 | 40 |
మొత్తం | 76 | 120 |