బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. కాంట్రాక్టు ప్రాతిపదికన 55 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు–ఖాళీలు: ట్రైనీ ఇంజినీర్-–25, ప్రాజెక్టు ఇంజినీర్–30. విభాగాలు: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ ఈ & టీ/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్, మెకానికల్;
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: ట్రైనీ ఇంజినీర్కి రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్కి రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు.
చివరి తేది: 2020 ఆగస్ట్ 2; వివరాలకు: www.bel-india.in
బీబీనగర్ ఎయిమ్స్ లో..
బీబీనగర్లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. 10 గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ తదితరాలు అర్హత: 10+2, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం. సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1500, ఎస్సీ/ఎస్టీలకు రూ.1200, దివ్యాంగులకు ఫీజు లేదు.
చివరి తేది: 2020 ఆగస్ట్ 31 వివరాలకు: www.main.jipmer.edu.in
ఐఐఐటీ -హైదరాబాద్లో…
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన 2 జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ రెండేళ్ల పని అనుభవం/ఎంఎస్/ఎంటెక్ ఉత్తీర్ణత. సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: ఆగస్ట్ 6
వివరాలకు: www.iiit.ac.in
ఎన్ఐఆర్డీపీఆర్‌లో 510 పోస్టులు
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీపీఆర్).. కాంట్రాక్టు ప్రాతిపదికన 510 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు–ఖాళీలు: స్టేట్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్–10, యంగ్ ఫెలో–250, క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్–250
అర్హత: ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో రిటెన్, స్పోకెన్ స్కిల్స్ కలిగి ఉండాలి. క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్కు ఎస్హెచ్జీలో గ్రూప్ లీడర్గా ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
విభాగాలు: ఎకానమిక్స్/రూరల్ డెవలప్‌మెంట్/పొలిటికల్ సైన్స్/ సోషయాలజీ/సోషల్ వర్క్ తదితరాలు
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా.
చివరి తేది: 2020 ఆగస్ట్ 10
వెబ్సైట్: www.nirdpr.org.in
టీఎంసీలో 146 పోస్టులు..
ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ) పరిధిలోని -అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(యాక్ట్రెక్).. 146 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్/ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, ఆఫీసర్ ఇన్‌చార్జ్, నర్సు, జూనియర్ ఇంజినీర్, ఫోర్‌మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, అసిస్టెంట్ డైటీషియన్ తదితరాలు; అర్హత: పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/మహిళ/దివ్యాంగులకు ఫీజు లేదు. చివరి తేది: 2020 ఆగస్ట్ 7; హార్డ్‌కాపీ పంపడానికి: 2020 ఆగస్ట్ 14; వివరాలకు: www.actrec.gov.in
ఆర్మీలో 300 ఎస్ఎస్‌సీ ఆఫీసర్స్
ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్.. 300 ఫార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టు: షార్ట్ సర్వీస్ కమీషన్డ్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్–300 (పురుషులు–270, మహిళలు–30); అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. నిర్దేశించిన ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి. వయసు: 2020 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్లకు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: రూ.200; చివరి తేది: 2020 ఆగస్ట్ 16; వివరాలకు: www.joinindianarmy.nic.in
ఎయిమ్స్, న్యూదిల్లీలో..
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. 12 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్‌లైన్/ఈ–మెయిల్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టు–ఖాళీలు: రిసెర్చ్ ఆఫీసర్–01, సీనియర్ రిసెర్చ్ ఫెలో–02, ఆప్టోమెట్రిస్ట్–02, ల్యాబ్ టెక్నీషియన్–02, డేటా ఎంట్రీ ఆపరేటర్–01, ఫీల్డ్ వర్కర్–02, ప్రాజెక్ట్ అటెండెంట్–02; అర్హత: 10+2, ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ఎంటెక్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ఎంపీహెచ్ ఉత్తీర్ణతతో పాటు రిసెర్చ్ అనుభవం; చివరి తేది: 2020 ఆగస్ట్ 5; వివరాలకు: www.aiims.edu
ఐపీఆర్‌లో 19 పోస్టులు
డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన గాంధీనగర్లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్(ఐపీఆర్).. 19 సైంటిఫిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: సైంటిఫిక్ ఆఫీసర్–06, సైంటిఫిక్ అసిస్టెంట్-09, టెక్నీషియన్-04; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.200, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. చివరి తేది: 2020 ఆగస్ట్ 15; వివరాలకు: www.ipr.res.in
నిఫ్ట్, శ్రీనగర్‌లో..
శ్రీనగర్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్).. కాంట్రాక్టు ప్రాతిపదికన 18 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్/ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: స్టెనో గ్రేడ్, అసిస్టెంట్ అకౌంట్స్, అసిస్టెంట్ వార్డెన్, మిషన్ మెకానిక్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఎంటీఎస్; అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. చివరి తేది: 2020 ఆగస్ట్ 4; వివరాలకు: www.nift.ac.in
ఇన్‌స్టెమ్‌లో 18 పోస్టులు
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ (ఇన్‌స్టెమ్).. 18 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: సీనియర్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్, క్లర్క్; అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా/ బీఈ/బీటెక్, సీఏ/సీఎంఏ/ఎస్ఏఎస్/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా; చివరి తేది: 2020 ఆగస్ట్ 9; వివరాలకు: www.instem.res.in
సీఎంఈఆర్ఐలో..
దుర్గాపూర్లోని సీఎస్ఐఆర్‌కి చెందిన -సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ).. కాంట్రాక్టు ప్రాతిపదికన 5 జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ క్వాలిఫై; విభాగాలు: మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్ సైన్స్; వయసు: 2020 ఆగస్ట్ 2 నాటికి 28 ఏళ్లు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్: temprct@cmeri.res.in; చివరి తేది: 2020 ఆగస్ట్ 2; వివరాలకు: www.cmeri.res.in
ఎన్ఐటీసీలో 125 పోస్టులు
కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన 125 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్/ ప్రాజెక్టు ఆఫీస్/ అసిస్టెంట్/ కంప్యూటర్ అసిస్టెంట్ తదితరాలు; అర్హత:10+2, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, అకడమిక్ మెరిట్ ఆధారంగా; చివరి తేది: 2020 ఆగస్ట్ 5; హార్డ్‌కాపీ పంపడానికి: 2020 ఆగస్ట్ 21; వివరాలకు: www.nitc.ac.in
ఐఐటీ –భువనేశ్వర్లో..
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన 19 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్స్, ప్రోగ్రామర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, హెల్పర్, సిస్టమ్ ఇంటిగ్రేటర్ తదితరాలు; అర్హత: 10+2, ఐటీఐ, ఎంబీబీఎస్, బీకాం, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎంఎస్సీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్: recruitment@iitbbs.ac.in; చివరి తేది: 2020 ఆగస్ట్ 4; వివరాలకు: www.iitbbs.ac.inనిమ్స్ న్యూఢిల్లీలో..
న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్‌కి చెందిన -నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్(నిమ్స్).. కాంట్రాక్టు ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ–మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్, రిసెర్చ్ అసోసియేట్/అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, సైంటిస్ట్‘బి’, ప్రాజెక్టు ఆఫీసర్; అర్హత: 10+2, సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా; చివరి తేది: 2020 ఆగస్ట్ 4; వివరాలకు: www.icmr-nims.nic.in