HomeLATESTఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లు.. జూన్​ 10​ వరకు అప్లికేషన్లు

ఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లు.. జూన్​ 10​ వరకు అప్లికేషన్లు

ఐటీఐ కాలేజీల్లో ఈ ఏడాది 2023 అడ్మిషన్లకు (TS ITI ADMISSIONS 2023) తెలంగాణ రాష్ట్ర ఉపాది కల్పన శిక్షణ విభాగం నోటిపికేషన్ విడుదల చేసింది. ఐటీఐలో చేరాలనుకునే విద్యార్థుల నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లను స్వీకరిస్తోంది. విద్యార్థులు జూన్​ 10 వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు గడువు నిర్ణయించింది. టెన్త్ పాసైన విద్యార్థులందరూ ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. కొన్ని ట్రేడ్​ల్లో చేరేందుకు 8వ తరగతి పాసై ఉంటే సరిపోతుంది.

రాష్ట్రంలో 63 గవర్నమెంట్​ ఐటీఐలతో పాటు 208 ప్రైవేటు ఇన్ స్టిట్యూట్​లు ఉన్నాయి. ఒకే అప్లికేషన్​, వెబ్​ ఆప్షన్ల ఆదారంగా అన్ని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. సీట్ల భర్తీకి మెరిట్​ కమ్​ రిజర్వేషన్​ పద్ధతి పాటిస్తారు.

Advertisement

అప్లై చేసే ముందు విద్యార్థులు తప్పనిసరిగా తమ సొంత ఆధార్​ కార్డు, సొంత మొబైల్​ నెంబర్​, సొంత మెయిల్ ఐడీ సిద్ధంగా ఉంచుకోవాలి. కాలేజీల్లో వెబ్​ ఆప్షన్లు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.

పూర్తి వివరాలు, ప్రాస్పెక్టస్​ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఆన్ లైన్​లో అప్లై చేసేందుకు వెబ్​సైట్​ https://iti.telangana.gov.in/

అప్లికేషన్ల డైరెక్ట్​ లింక్​ https://tsiti.ucanapply.com/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!