HomeLATESTడిగ్రీ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు..ఈ లింక్ తో అప్లై చేసుకోండి.

డిగ్రీ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు..ఈ లింక్ తో అప్లై చేసుకోండి.

భారత త్రివిధ దళాలకు చెందిన ఇండియన్‌ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇండియన్‌ నావల్‌ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్‌ https://indiannavy.cbexams.com/లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

Advertisement
విభాగాలు:

ఎలక్ట్రికల్, వెపన్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్.

ట్రేడ్స్:

ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్, గైరో ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, సోనార్ ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్, బాయిలర్ మేకర్, ఇంజిన్ ఫిట్టర్, ఫౌండర్, జీటీ ఫిట్టర్, ఐస్‌ ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, మెషినిస్ట్‌, మెషినరీ కంట్రోల్‌ ఫిట్టర్‌, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ ఫిట్టర్, ప్లేటర్, వెల్డర్, షిప్ రైట్, లాగర్, రిగ్గర్, షిప్ ఫిట్టర్, మిల్ రైట్, ఐస్ ఫిట్టర్ క్రేన్, పెయింటర్, సివిల్ వర్క్స్, పీపీ అండ్‌ సి ట్రేడ్స్ లలో ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

వయోపరిమితి: మే 29, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్ధులు రూ.278 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

Advertisement

జీతభత్యాలు: ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు.

దరఖాస్తు విధానం: మే 29, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్ సైట్: https://indiannavy.cbexams.com/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!