HomeLATESTఏపీలో భారీగా టీచర్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!

ఏపీలో భారీగా టీచర్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!

ఏపీలో టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచింగ్ జాబ్స్ భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ వారి నుంచి ఈ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1358 టీచర్‌ (ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 29 నుంచి ప్రారంభమైంది.

Advertisement

దరఖాస్తు చేసుకోవడానికి తొలుత జూన్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించగా.. తాజాగా ఆ గడువును అధికారులు జూన్ 8వ తేదీ వరకు పొడిగించారు. దీంతో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11:59 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించే అవకాశం ఇచ్చారు. http://apkgbv.apcfss.in/ వెబ్ సైట్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్హలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుక కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.

ఖాళీల వివరాలు..
– ప్రిన్సిపాల్ పోస్టులు 92
– పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 846
– సీఆర్టీ పోస్టులు 374
– ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులు 46

Advertisement

వయో పరిమితి:
ఈ ఉద్యోగాలకు 18-42 ఏళ్లను వయో పరిమితిగా విధించారు. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!