హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్ అందిస్తోంది. స్టేట్ సర్వీసెస్, ఎస్సెస్సీ, బ్యాంక్ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల ఫ్రీ ట్రైనింగ్ కోర్సులో చేరేందుకు అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. డిగ్రీ పాసైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ కోచింగ్కు అర్హులు.రాత పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఉంటాయి.
అర్హత: మూడేళ్ల డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్సీ), నాలుగేళ్ల బీటెక్/ బీఫార్మా/ బీఎస్సీ (అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణత.
ట్రైనింగ్: ఐదు నెలలు;
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష;
ఎగ్జామ్: డిసెంబర్ 5;
ఆన్ లైన్లో అప్లికేషన్లకు లాస్ట్ డేట్: నవంబర్ 30
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.studycircle.cgg.gov.in
ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫ్రీ ట్రైనింగ్
Advertisement
Advertisement