తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా దాదాపు సగం విద్యాసంవత్సరం విద్యార్థులు నష్టపోయారు. అందుకే ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలను 70% సిలబస్ తో నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు.
తొలిగించిన 30 శాతం సిలబస్‌ను.. పరీక్షలకు ఎంపిక చేసిన 70 శాతం సిలబస్ చాప్టర్ల వివరాలను త్వరలోనే ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనుంది. ఎంపిక చేసిన సిలబస్ ప్రకారం తయారు చేసిన మోడల్ పేపర్లను కూడా త్వరలోనే వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.
