HomeLATESTగురుకులాల్లో ఇంటర్​ అడ్మిషన్లకు ఎంట్రన్స్​ 2022–23: జనవరి 25 లాస్ట్ డేట్​ TSWR JC&COE CET...

గురుకులాల్లో ఇంటర్​ అడ్మిషన్లకు ఎంట్రన్స్​ 2022–23: జనవరి 25 లాస్ట్ డేట్​ TSWR JC&COE CET – 2022

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియేట్​ ప్రవేశాలకోసం సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్స్​ ‘సీఓఈ’ నోటిఫికేషన్​ విడుదల చేసింది. టీ​ఎస్​డబ్ల్యూఆర్​జేసీ అండ్​ సీఓఈసెట్​ నిర్వహించే కామన్​ ఎంట్రెన్స్​ ద్వారా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్​ఈసీ, ఎంఈసీ గ్రూపులతో పాటు ఒకేషనల్​ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఐఐటీ, నీట్​ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కోచింగ్​ ఇస్తారు.

ఈ విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షలు రాసే ఇంగ్లీష్​ లేదా తెలుగు మీడియం విద్యార్థులు ఈ ఎంట్రెన్స్​ రాసి అడ్మిషన్లు పొందవచ్చు. వయసు ఆగస్ట్​ 31 నాటికి 17ఏళ్ల లోపు ఉండాలి. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. లక్షా 5‌0వేలు, పట్టణాల్లో రూ.2లక్షల లోపు ఉండాలి.

Advertisement

పరీక్ష ఎలా ఉంటుంది;

గురుకుల ఎంట్రె​న్స్​ టెస్ట్​ ఆబ్జెక్టివ్​ టైప్​లో 150 మార్కులకు నిర్వహిస్తారు.
ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున ఉంటుంది.
ఇందులో మ్యాథ్స్​, ఫిజికల్​ సైన్స్​, బయోసైన్స్​, సోషల్​ స్టడీస్​ సబ్జెక్టులనుంచి ఒక్కో దానిలో 30 ప్రశ్నలు అడుగుతారు.
ఇంగ్లీష్​, జనరల్​ నాలెడ్జ్​, కరెంట్​ అఫైర్స్​ అంశాల నుంచి ఒక్కోదానిలో 15 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. తప్పు జవాబుకు 0.25 మార్కు కోత విధిస్తారు.
ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్​ మాధ్యమాల్లో ఉంటుంది.

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 25 చివరితేది. పరీక్ష ఫీజు రూ.100 ఉంటుంది. ఫిబ్రవరి 20న ఎంట్రెన్స్​ టెస్ట్​ నిర్వహిస్తారు.
వెబ్​సైట్​ : www.tsswreisjc.cgg.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!