నీట్-పీజీ అడ్మిషన్స్‌కు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021-22 ఏడాదికి నీట్- పీజీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
రిజర్వేషన్లకు అనుమతి
ఈ ఏడాది మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే నీట్ కౌన్సిలింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారుల్ని గుర్తించేందుకు రూ.8లక్షల ఆదాయ పరిమితికి కూడా ఓకే చెప్పింది. దీనికి సంబంధించి మార్చి మూడో వారంలో విచారణ జరుపుతామని, ఆ సమయంలో ఈడబ్ల్యూఎస్ చెల్లుబాటును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ ప్రవేశాలు తుదితీర్పును లోబడి ఉండనున్నాయి.
వచ్చే ఏడాదికి కొత్త రూల్స్
ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ప్రమాణాలను కొనసాగించాలని కోర్టును ప్రభుత్వం కోరింది. ప్రవేశాలు, కళాశాలల కేటాయింపులు జరుగుతున్న సమయంలో నిబంధనలు మార్చడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని వెల్లడించింది. సవరించిన నిబంధనలను వచ్చే ఏడాదికి వర్తింపజేయవచ్చని పేర్కొంది.
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఊరట
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేసేందుకు ₹8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని నీట్-పీజీ అభ్యర్థులు కొందరు సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు అంతకంటే ఎక్కువ ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలను ఈ పరిమితి నుంచి మినహాయించింది.
నీట్- పీజీ కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS