టెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. గతంతో పోలిస్తే రిజల్ట్ గణనీయంగా పడిపోయింది. కేవలం 15.30% మంది ఉత్తీర్ణత సాధించారు. దాదాపు మూడు లక్షల మంది (3,02,067) ఫెయిల్ అయ్యారు. పేపర్ 1 ఎగ్జామ్ 2,23,582 మంది అటెండయ్యారు. అందులో కేవలం 82489 మంది ( 36.89%) క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 మాథ్స్ అండ్ సైన్స్ పేపర్ లో 18.66%, పేపర్ 2 సోషల్ స్టడీస్ లో 11.47% మంది క్వాలిఫై అయ్యారు. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించారు. టెట్ అర్హత ఒక్కసారి పొందితే కాలపరిమితి లైఫ్ టైమ్ ఉంటుంది.