హైకోర్టులో టీఎస్పీఎస్సీకి మళ్ళీ షాక్ తగిలింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుకే డివిజన్ బెంచ్ కూడా మొగ్గు చూపింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ డిస్మిస్ చేసింది. తిరిగి పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. తదుపరి పరీక్షను నిర్వహించే సమయంలో ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించింది.
Advertisement