HomeLATESTTSPSC Group-1 Preliminary Key Updates: మరికొద్ది సేపట్లో గ్రూప్-1 ప్రైమరీ కీ.. తాజా అప్డేట్స్..

TSPSC Group-1 Preliminary Key Updates: మరికొద్ది సేపట్లో గ్రూప్-1 ప్రైమరీ కీ.. తాజా అప్డేట్స్..

దాదాపు 2.8 లక్షల మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రాథమిక ‘కీ’ విడుదలకు టీఎస్పీఎస్సీ (TSPSC) ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు రాత్రి కీని విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత కీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఓఎంఆర్ షీట్లకు సంబంధించి స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రైమరీ కీతో పాటు, ఓఎంఆర్ షీట్లను సైతం వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనుంది టీఎస్​పీఎస్సీ. అభ్యర్థులు వారి వివరాలతో లాగిన్ అయ్యి కీ, ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సారి గ్రూప్1 ప్రిలిమ్స్ ను సెట్స్ రూపంలో కాకుండా.. నంబర్ సిరీస్ రూపంలో ఇచ్చారు. దీంతో ఒక్కో సిరిస్​కు ఒక్కో ‘కీ’ పేపర్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.

Advertisement

ఈ క్రమంలో మాస్టర్ క్వొశ్చన్​ పేపర్ కు మాత్రమే ‘కీ’ ఇవ్వాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయించింది. అభ్యర్థులు ప్రిలిమినరీ ‘కీ’పై అభ్యంతరాలను తెలపడానికి వారం రోజుల వరకు సమయం ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ. ఆ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ఫైనల్ కీని విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. ఆ వెంటనే ఫలితాలు సైతం విడుదల చేయనున్నారు. ప్రతీ కేటగిరిలో ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే.. గ్రూప్-1 పేపర్ యూపీఎస్సీ స్థాయిలో కఠినంగా ఉందని మెజార్టీ అభ్యర్థులు, నిపుణులు చెబుతున్నారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!