దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (IITs)ల్లో బీటెక్ లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ కు సంబంధించిన పరీక్ష షెడ్యూల్ ను ఐఐటీ గువాహటి విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి మే 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు మే 5 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పరీక్షను జూన్ 4వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మొత్తం 2 పేపర్లు ఉండగా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, పేపర్-2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంకా.. విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 24 నుంచి మే 4 వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో వెల్లడించారు. ఫీజు చెల్లించడానికి మే 5వ తేదీ వరకు వారికి అవకాశం ఉంటుంది.