Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఈ రోజు సాయంత్రం లేదా రేపే గ్రూప్​ 1 రిజల్ట్

ఈ రోజు సాయంత్రం లేదా రేపే గ్రూప్​ 1 రిజల్ట్

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈరోజు సాయంత్రం లేదా రేపు వెల్లడి కానున్నాయి. టీఎస్‌పీఎస్​సీ అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్​ 1 ఫలితాలకు అడ్డంకిగా మారిన హైకోర్టు కేసు ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశముంది. హైకోర్టులో ఉన్న కేసు విచారణ పూర్తయిందని, మంగళవారం లేదా బుధవారం హైకోర్టు నుంచి తీర్పు వెలువడే అవకాశముంది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రిలిమ్స్​ రిజల్ట్ రిలీజ్​ కు లైన్​ క్లియర్​ అవుతుంది. తీర్పు కాపీ తమకు అందిన వెంటనే ప్రిలిమ్స్​ క్వాలిఫై అభ్యర్థుల లిస్ట్ విడుదల చేస్తామని టీఎస్​పీఎస్​సీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టులకు అక్టోబర్‌ 16న టీఎస్‌పీఎస్​సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల 29న ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. అభ్యంతరాలు, నిపుణుల కమిటీ సూచనలతో 5 ప్రశ్నలను తొలిగించింది. నవంబర్‌ 15న ఫైనల్​ కీ రిలీజ్​ చేసింది. రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్‌ రిజల్ట్స్​ ఇస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈలోగా పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించటంతో రిజల్ట్ పెండింగ్​లో పడింది.

Advertisement

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. 503 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమ్స్​లో వచ్చిన మార్కుల మెరిట్​తో పాటు రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున (1:50 నిష్పత్తిలో) అభ్యర్థులను మెయిన్స్​కు ఎంపిక చేస్తారు. ఈ లెక్కన మొత్తం 503 పోస్టులకు 25150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. ప్రిలిమ్స్​ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కనీసం మూడు నెలల వ్యవధి ఉండేలా మెయిన్స్​ పరీక్షకు షెడ్యూలు రిలీజ్​ చేయనున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. దీంతో మే నెలలో గ్రూప్​ 1 మెయిన్స్​ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!